పర్సు…పరుసే
యథాలాపంగా స్నేహితులం కొందరం, ఇంట్లో పని ఎగ్గొట్టి మా సమావేశానికి అనువైన ఆదివారం, ఒక కాపీ (కాఫీ) కొట్లో (కొట్టేమిటి అసహ్యంగా ..!) కలుసుకుని, అత్యంత విలువైన మాటలు మాట్లాడుకుంటున్నాం. ఒకరు ఒబామ అంటే, వేరొకరు రామ్ని. ఇలా అమెరికాకి కాబోయే రాష్రపతి గురించి ఒకటే చర్చ. వెధవది, ఇంట్లో పప్పు వండాలో, కొత్త సొఫా కొనాలో లెదో, అమ్మాయికి డాన్సు నేర్పాలో లేదో లాంటి చిన్న చిన్న ఇంటి విషయాలు ఇల్లాలికి వదిలేసి, దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు నిర్ణయించే అధికారం కొల్పోకుండా, మా మానాన్ని మేము మా లొకంలో విహరించే సమయానికి వూడిపడ్డాడు ఇంకో కోతి (అదేనండీ స్నేహితుడు). వీడి గురించి చెప్పాలంటే కవితే కరెక్టు.. నెత్తి మీద వున్నాయి వేలెడెన్నివెంట్రుకలు,…